రణరంగంగా మారిన ధర్నా చౌక్..
posted on May 15, 2017 12:33PM

ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధర్నా చౌక్ తరలింపుపై అనుకూల, ప్రతికూల వర్గాల నినాదాలతో.. పోటాపోటీ ఆందోళనతో దద్దరిల్లింది. ధర్నాచౌక్ తరలించాలంటూ స్థానిక కాలనీవాసులు ధర్నా చేపట్టారు. మరోవైపు ధర్నాచౌక్ తరలింపును నిరసిస్తూ టీజేఏసీ చేపట్టిన ధర్నాకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వడంతో రెండు వర్గాలు దాడికి పాల్పడ్డాయి. ధర్నాచౌక్‌ను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నినాదాలు చేస్తుండగా.. సీపీఐ కార్యకర్తలు ధర్నా చౌక్‌ను తరలించొద్దని పెద్ద ఎత్తున దూసుకురావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు కుర్చీలు, కర్రలు, జెండాలతో దాడులకు పాల్పడ్డారు. దీంతో మఫ్టీలో ఉన్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఇక ఇరు వర్గాల వారి నినాదాలు, దాడుల మధ్య ఇందిరాపార్క్ రణరంగంలా తయారైంది.