పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్

పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రశిబిరాలు లక్ష్యంగా మెరుపు దాడులకు దిగింది. బుధవారం (మే7)   పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ (పీఓకే) లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత సేనలు మిస్సైల్ దాడులు నిర్వహించాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన ఈ సర్జికల్ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. దాడుల అనంతరం న్యాయం జరిగింది. జై హింద్ అంటూ ఇండియన్ ఆర్మీ ఎక్ప్ వేదికగా పోస్టు చేసింది.

ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన ఈ సర్జికల్ స్ట్రైక్ లో పీవోకే లోని కొట్టి, ముజఫరాబాద్, బహవల్ పూర్ సహా మరికొన్ని ప్రదేశాలపై భారత్ సేనలు క్షిపణి దాడులు జరిపాయి. ఎయిర్ టు సర్ఫేస్ క్షిపణులను ప్రయోగించాయ.
పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్‌లోని బహవల్‌పూర్‌తో పాటు లాహోర్‌ లోని ఒక ప్రదేశంపై భారత్‌ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా 'ఎయిర్‌ టు సర్ఫేస్‌' మిసైళ్లను ప్రయోగించారు.  

పహల్గాం దాడిలో అమానుషంగా అమాయకుల ప్రాణాలు తీసిన ముష్కరుల అంతమే లక్ష్యంగా జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ లో మొత్తం 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసినట్లు ఆర్మీ పేర్కొంది. ఈ సర్జికల్ స్ట్రైక్ లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు.    

Online Jyotish
Tone Academy
KidsOne Telugu