ఢిల్లీ టెస్ట్: భారత్ లక్ష్యం 155

 

 

 

 

ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో టెస్ట్ మూడో రోజు 266/8తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మరో ఆరు పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. లియోన్ ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు. మాక్స్‌వెల్, సిడిల్, పాటిన్సన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఆతరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ వార్నర్, మాక్స్‌వెల్‌లు ఆరంభంలోనే అవుటయ్యారు. మాక్స్‌వెల్, వార్నర్‌ జడెజా ఆవుట్ చేసి ఆదిలోనే దెబ్బ తీశాడు. కొవాన్, హ్యూస్ క్రీజులో నిలకడగా అడే ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు. కేవలం 53 పరుగులకే ఆసీస్ ఐదు కీలక వికెట్లను కోల్పోయింది.


ఆ తర్వాత వేడ్, స్మిత్‌లు కాసేపు నిలకడగా ఆడారు. అనంతరం స్మిత్(18) జడెజా బౌలింగులో ఆరో వికెట్‌గా అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన జాన్సన్ పరుగులేమీ చేయకుండానే క్రీజు వదిలాడు. ఆ తర్వాత వేడ్(19) ఓజా బౌలింగులో ధోనీకి క్యాచ్ ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. 157 పరుగుల వద్ద పాటిన్సన్(11) రూపంలో తొమ్మిదో వికెట్ పడిపోయింది. సిడిల్(50) ఒక్కడే రాణించాడు. తోమ్మిదో నెంబరులో వచ్చి రెండు వరుస అర్ధసెంచరీలు చేసిన ఘనత సిడిల్‌కి దక్కింది. 164 పరుగుల వద్ద ఆసీస్ ఆఖరి వికెట్ కోల్పోయింది. జడెజా ఐదు, ఓజా, అశ్విన్‌లు చెరో రెండు, ఇషాంత్ శర్మలు చెరో వికెట్ తీసుకున్నారు. భారత్ లక్ష్యం 155 పరుగులు.