కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్

 

కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీ నుండి తిరిగి రాగానే తన పదవికి రాజీనామా ఇచ్చి సీమంధ్ర నేతలు పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీకి సారద్యం వహిస్తారని మీడియాలో వార్తలు గుప్పుమంటుంటే, తాజాగా మరో ఆసక్తికరమయిన వార్త బయటకి వచ్చింది. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీలో కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణలను సభ్యులుగా నియామకం జరిగిందని సమాచారం. ఇక మరో సంచలన వార్త ఏమిటంటే హైదరాబాదును పద్దేళ్ళపాటు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకొందని సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ తాను అంటోనీ కమిటీని కలిసి భద్రాచలం తెలంగాణకు చెందుతుందని చెప్పానని తెలిపారు. మరో ప్రశ్నకు జవాబిస్తూ హైదరాబాద్ సంగతి తనకు తెలియదని ఆమె చెప్పడం బహుశః ఇదే సూచిస్తోందనుకోవచ్చును. ఈ రోజు డిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంటోనీ కమిటీని కలిసినప్పుడు, అంటోనీ ఇదే విషయం ఆయనకు తెలియజేసి నచ్చచెప్పవచ్చును. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేయడం ద్వారా సీమంద్రాలో ఉద్యమాలను అదుపులోకి తీసుకురావచ్చునని బహుశః కాంగ్రెస్ ఆలోచన కావచ్చును. కానీ, అప్పుడు తెలంగాణాలో మళ్ళీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం ముందుగా సంబంధిత వర్గాలను నేతలను ఒప్పించకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం