హిల్లరీ క్లింటన్ పై ట్రంప్ పొగడ్తలు..
posted on Jan 21, 2017 4:09PM

ఎన్నికల ప్రచారంలో హిల్లరీ క్లింటన్ పై విమర్శనాస్త్రాలను విసిరిన ట్రంప్.. తన ప్రమాణ స్వీకారం రోజున మాత్రం ట్రంప్.. హిల్లరీపై ప్రశంసలు కురిపించారు. నిన్న ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిన నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి హిల్లరీ క్లింటన్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్..తన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను హిల్లరీ క్లింటన్, బిల్ క్లింటన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు.. బిల్‌క్లింటన్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరు కావటాన్ని తాను అత్యంత గౌరవంగా భావిస్తానని.. ‘‘వారితో కలిసి నిలబడేందుకు ఇష్టపడతాను. నిజంగా చెబుతున్నా.. నాకు వారంటే ఎనలేని గౌరవం’’ అని ట్రంప్ అన్నారు. మేమందరం మంచివాళ్లం.. అంతా ఒకటే కోరుకుంటాం.. అని తెలిపారు. ట్రంప్ హిల్లరీ గురించి చెప్పేటప్పుడు సమావేశ ప్రాంగణంలోని వారంతా గౌరవ సూచకంగా ఒక్కసారి లేచి నిలబడి కరతాళధ్వనులతో అభివాదం చేశారు.