దూసుకుపోతున్న ట్రంప్.. హిల్లరీకి బ్రేకులు

 

అమెరికా అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్ధిగా ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ తన బెర్త్ ను కన్ఫామ్ చేసుకున్నాడు. ఇక మరోవైపు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కూడా రేసులో దూసుకుపోతున్న తరుణంలో మధ్య మధ్యలో బ్రేకలు పడుతున్నాయి. ఇటీవల జరిగిన ఇండియానా ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఓడిపోగా.. ఇప్పుడు వెస్ట్ వర్జీనియా ప్రైమరీలో కూడా తన సొంత పార్టీ అభ్యర్ధి బెర్నీ సాండర్స్ చేతిలో పరాజయం పాలైయ్యారు. ఇక ట్రంప్ మాత్రం వర్జీనియా వెస్ట్, నెబ్రాస్కాల్లో విజయం సాధించి తన అవకాశాలను మరింత మెరుగుపర్చుకున్నారు.

 

అయితే బెర్నీ సాండర్స్ పై ఓడిపోయినప్పటికీ హిల్లరీ క్లింటన్ మాత్రం.. మహిళా ఓట్లకు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. మహిళలతో ముచ్చటించిన ఆమె.. మహిళా హక్కులు, జీతాలు, ఫీజుల గురించి ఆమె చర్చించినట్టు సమాచారం. అంతేకాదు తాను అమెరికా అధ్యక్షురాలునైతే సమస్యలకు పరిష్కారం చూపుతానని చెప్పారు. మరి ఆ ఆవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu