రఘురామ ఇంప్లీడ్ పిటిషన్ ను అనుమతించిన హైకోర్టు

అస‌లే పాల‌నా లోపాల‌తో ఉక్కిరిబిక్కిర‌వుతున్న జ‌గ‌న్ స‌ర్కార్‌కు రిషికొండ రిసార్ట్ పున‌రుద్ధ‌ర‌ణ కేసు త‌ల‌కుచుట్టుకుంది. విశాఖలోని రుషికొండ రిసార్ట్‌ పునరుద్ధరణ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి పర్యావరణ ఉల్లంఘనలు చోటు చేసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. చట్టపరమైన అనుమతు లన్నీ తీసుకున్న తరు వాతే పునరుద్ధరణ పనులు ప్రారంభించామని, కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) నిబంధనలకు లోబడే జరుగుతున్నాయని తెలిపింది. 

ఆర్థిక, పర్యాటక అవకాశాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలను అడ్డుకోవా లన్న దురుద్దేశంతోనే ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారని పేర్కొంది. తప్పుడు ఆరోపణలతో దాఖలైన వ్యాజ్యాలను భారీ జరిమానాతో కొట్టి వేయాలని న్యాయ స్థానా న్ని అభ్యర్థించింది. జాతీయ హరిత ట్రిబ్యు నల్‌ (ఎన్‌జీటీ) నియమించిన నిపుణుల కమిటీ సైతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి చట్ట ఉల్లం ఘనలు జరగ లేదని తేల్చినట్లు గుర్తు చేసింది.

 రుషికొండ వ్యవహారాల కేసులో తనను కూడా ఇంప్లీడ్ చేయాలని రఘురామ కృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేశారు.  కాగా ఈ కేసులో ఇప్పటికే హైకోర్టులో  రెండు  ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖ లయ్యాయి. సుప్రీంకోర్టు సూచనల మేరకు రఘురామ పిటీషన్ ను అనుమతించాలని న్యాయవాది ఉమేష్ చంద్ర వాదించారు. ఆయ‌న‌ వాదనలను పరిగణలోకి తీసుకుని రఘురామరాజు పిటిషన్ ను సి.జే నేతృత్వంలోని ధర్మాసనం  విచారణకు అనుమతించింది.   రుషికొండలో పర్యవరణ ఉల్లంఘనలపై గతంలో జాతీయ హరిత ట్రిబ్యూనల్ కు రఘురామకృష్ణం రాజు లేఖ రాసిన సంగతి విదితమే. దీంతో రుషికొండపై తవ్వకాలు పర్యవరణ కాలుష్యంపై స్టే విధిస్తూ హరిత్ర ట్రిబ్యూలన్ ఆర్డర్ దీంతో దీనిపై ఏపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సివిల్ అప్పీల్ కు వెళ్ళింది.

సుప్రీకోర్టు దీనిపై స్పందిస్తూ దీనిపై ఏపి హైకోర్టులో పెండింగ్ ఉన్న పిటిషన్లతో ఇంప్లీడ్  అవ్వమని చెప్పింది. దాన్ని అనుస‌రించి ఇంప్లీడ్ పిటీషన్ హైకోర్టులో దాఖలు చేశామని న్యాయవాది ఉమేష్ చంద్ర  తెలిపారు. దీనిపై న్యాయస్ధానం స్పందిస్తూ అనుబంధ‌ పిటిషన్ ను అనుమతించింది. కాగా ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని  కోర్టు అన్నిపిటిషన్ల విచారణను ఈ నెల 27కు వాయిదావేసింది రఘురామ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించిన సి.జే నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu