హైకోర్టులో ఏసీబీకి ఎదురు దెబ్బ.. హాస్పిటల్ కు షిఫ్ట్ చేయమని ఆదేశాలు

అచ్చెన్నాయుడు కేసులో ఏసీబీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అచ్చెన్న దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు వెంటనే ఆయనను ప్రయివేట్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందించాలని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలపై ఏసీబీ తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాదించారు. అచ్చెన్నాయుడును ఏ ఆస్పత్రికి తరలించాలన్నది గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌ నిర్ణయించాలని లాయర్ వాదించారు. అయితే ప్రభుత్వం తరుఫు న్యాయవాది వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అచ్చెన్నాయుడును గుంటూరు లోని రమేష్‌ ఆస్పత్రికి తరలించనున్నట్లుగా తెలుస్తోంది.

ఏసీబీ అరెస్ట్ కు ఒక రోజు ముందు అచ్చెన్నాయుడు కు పైల్స్ ఆపరేషన్ జరగడంతో జడ్జ్ ముందు హాజరు పరిచి ఆయనను గుంటూరు జీజీహెచ్ లో చేర్చి చికిత్స అందించారు. అయితే జూలై 1న గుంటూరు ప్రభుత్వాస్పత్రి నుంచి పూర్తిగా కోలుకోకుండానే డిశ్చార్జి చేసారు. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు నేరుగా విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. అయితే ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఆయన్ను బలవంతంగా డిశ్చార్జి చేశారని అపుడే టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు.