ప్రధాని మోడీ ‘తిరంగా’ పిలుపు
posted on Aug 9, 2024 11:57AM
స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయే కార్యక్రమంలా జరుపుకుందామంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇస్తున్నారు. ఆయన తన ‘ఎక్స్’ అకౌంట్ ప్రొఫైల్ పిక్‌లో త్రివర్ణ పతాకాన్ని పెట్టారు. "నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకున్నాను. మీరు కూడా అలాగే చేయండి. జాతీయ జెండాలతో ఉన్న మీ సెల్ఫీలను harghartiranga.comలో షేర్ చేయండి" అని మోదీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మోడీ పిలుపుతో పలువురు నెటిజన్లు తమ డీపీలను త్రివర్ణ పతాకంతో మార్చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తిరంగా యాత్రలను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.