'జీఎస్టీ' ప్రభావం... పుట్టిన శిశువుకు 'జీఎస్టీ' నామాకరణం...
posted on Jul 3, 2017 11:36AM

గత కొద్ది రోజులుగా ఎవరి నోటి వెంట విన్నా జీఎస్టీ అనే పదమే వినిపిస్తుంది. అంతలా జీఎస్టీ ప్రభావం ప్రజలపై పడింది. ఎంత పడిందంటే పుట్టిన పిల్లలకు కూడా జీఎస్టీ పేరునే పెట్టుకునేంత. ఈ విచిత్రమైన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. అసలు సంగతేంటంటే.. జూన్ 30 అర్థ్రరాత్రి జీఎస్టీ బిల్లుని పార్లమెంట్లో పెద్దలు లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రాజస్థాన్‌లోని పాలి జిల్లా కేంద్రానికి చెందిన జస్‌రాజ్ భార్యకి నొప్పులు రావడంతో ఆమెని బాంగడ్ ఆస్పత్రిలో చేర్పించారు. సరిగ్గా 12 గంటలకి జస్‌రాజ్ భార్య పండంటి కవల పిల్లలకి జన్మనిచ్చింది. వారిలో ఒకరు మగ శిశువు కాగా మరొకరు ఆడపిల్ల. వీరిలో ఆడ పిల్లకి జీఎస్టీ అని నామకారణం చేశారు. అక్కడున్న ఆస్పత్రి సిబ్బంది కూడా ఆ శిశువుని జీఎస్టీ అనే పిలవడం మొదలుపెట్టారు.