గోదావరి ఉగ్రరూపం...

 

భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గంట గంటకూ వరద జోరు పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి 55 అడుగుల మేర ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం వద్ద మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు. భద్రాచలానికి ఎగువనున్న ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడూ ఇంద్రావతి, చెంగల్వ, వెంగల్వ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉరవడి అంతా గోదావరిలో కలవడంతో తీవ్రప్రభావం చూపిస్తోంది. చెర్లమండలం, తాళ్లపేగు ప్రాజెక్టు నుంచి 13 గేట్లు ఎత్తివేసి 80వేల క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరిలోకి వదులుతున్నారు. దీనికి తోడూ ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.