‘గెటౌట్’ అంటే గానీ బయటకి పోరా?
posted on Jun 7, 2024 9:29PM
ఐదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ప్రభుత్వం పాతాళంలోకి పడిపోయింది. తమను నామినేట్ చేసిన ప్రభుత్వం పడిపోగానే తమ పదవులకు రాజీనామా చేయాలని కూడా తెలియని తోలుమందం బ్యాచ్ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లుగా, డైరెక్టర్లుగా, సభ్యులుగా వున్నారు. కొర్పొరేషన్లకు నామినేట్ అయిన వాళ్ళెవరూ జగన్ ప్రభుత్వం ఖతమ్ అయిపోయిన తర్వాత తమ పదవులకు రాజీనామాలు చేయకుండా సీట్లకి ఫెవీకాల్ రాసుకుని కూర్చునే వున్నారు. కొంతమంది అంతే, తన్ని తరిమితేగాని బయటకి వెళ్ళరు. అలాంటి వాళ్ళ కోసం చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గెటవుట్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు వున్న నామినేటెడ్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యులు వెంటనే రాజీనామాలు చేయాలని ఆదేశించారు. తమకు వచ్చిన రాజీనామాలను వెంటనే ఆమోదించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.