జర్మనీ మంత్రి ఆత్మహత్య

 కరోనా వైరస్ కల్లోలంతో కలత చెందిన జర్మనీ హెస్సేల్ స్టేట్ ఆర్ధిక మంత్రి థామస్ షెఫర్ ఆత్మహత్య కు పాల్పడ్డారు. ఈ విషయంన్ని స్టేట్ ప్రీమియర్ వోల్కర్ బోఫీర్ ధృవీకరించారు. థామస్ షెఫర్ ఈ కరోనా వైరస్ కారణంగా బాగా ఆందోళనాకు లోనయ్యారని బొఫీర్ పేర్కొన్నారు. 54 సంవత్సరాల థామస్ బొఫీర్ శనివారం నాడు రైల్వే ట్రాక్ దగ్గర విగతజీవిగా పడి  ఉండటాన్ని గుర్తించినట్టు వేస్ బ్యాడెన్ ప్రాసిక్యూషన్ కార్యాలయం వెల్లడించింది. ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాసిక్యూషన్ కార్యాలయం పేర్కొంది. 

స్టేట్ ప్రీమియర్ బొఫీర్ ఈ విషయం మీద స్పందిస్తూ, థామస్ షెఫర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని నమ్మలేకపోతున్నామని, ఈ తరుణంలో ఇది తామందరికీ అత్యంత బాధ కలిగించే విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగాఉత్పన్నమైన ఆర్ధిక పరమైన సమస్యలను ఎలా అధిగమించగలమనే ఆందోళన వల్లనే థామస్ షెఫర్ ఆత్మహత్యకు పాల్పడివుండవచ్చునని ఆయన భావించారు. 

హెస్సే వాస్తవానికి ప్రముఖ వాణిజ్య సంస్థలైన డ్యూషే బ్యాంక్, కామర్స్ బ్యాంక్ ల ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రాంతం. గడిచిన పదేళ్లుగా హెస్సే స్టేట్ కు థామస్ బొఫీర్ ఆర్ధిక మంత్రి గావ్యవహరిస్తున్నారు. ఈ కరోనా వైరస్ బారిన పడిన కంపెనీలను, ఉద్యోగులను, కార్మికులను ఆర్ధికంగా ఆదుకునే దిశగా చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన థామస్ షెఫర్  ఆత్మహత్యకు పాల్పడ్డారు.