విసుగెత్తిన నర్స్.. 106 మంది రోగులను చంపేసింది...

 

వైద్యుడు దేవుడితో సమానం అంటారు. మరి నర్సు.. ఆల్ మోస్ట్ దేవుడంత కాకపోయినా పూజారితో సమానం అనుకోండి. డాక్టర్ చికిత్స మాత్రమే చేస్తాడు. దగ్గరుండి చూసుకునేది మాత్రం నర్సులే. అలాంటిది ఓ నర్సు.. ఏకంగా 106 మందిని హతమార్చింది. అది కూడా విసుగుచెంది హత్యచేయడం. ఈ దారుణమైన ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. జర్మనీలోని డెల్మెన్‌ హోస్ట్‌ ఆసుపత్రిలో నీల్స్ హోగెల్ (41) అనే మహిళ నర్సుగా పని చేస్తోంది. అయితే ఆమె ఇద్దరి రోగులను హత్య చేయడంతో పాటు  మరో ఇద్దరిపై హత్యాయత్నం చేసిందన్న కేసులో అరెస్టు అయింది. ఇక ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. ఆమె రోగులను చంపడం ఇది తొలిసారి కాదని... మొత్తం ఇప్పటికి.. 106 మందిని హతమార్చిందని తెలిపారు. ఈ హత్యలన్నీ 1999 నుంచి 2005 మధ్యకాలంలో చేసినట్టు తెలిపారు. ముందు 90 మందిని హతమార్చినట్టు గుర్తించి... న్యాయస్థానం ఆమెకు జీవిత ఖైదు ఖరారు చేసింది. ఆతరువాత మరికొంత మంది బాధితులు ఈ కేసు మరోసారి దర్యాప్తు చేయాలని కోరడంతో.. పోలీసులు దర్యాప్తు చేపట్టగా మరో 16 మందిని హతమార్చినట్టు గుర్తించారు. దీంతో ఆమె మొత్తం 106 మందిని హతమార్చింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వైద్యం అంటే విసుగు చెంది వారందర్నీ చంపానని నీల్స్ హోగెల్ చెప్పడం.