పవన్‌కు "గౌరీ లంకేశ్" పేరు తెలియదట..!

దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ దారి వేరు..జనాల సమస్యలపై ప్రశ్నించేందుకు పార్టీ పెట్టుకున్న ఆయన సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్‌గా ఉంటూ, అప్పుడప్పుడు మాత్రమే జనాల్లోకి వెళతారు. గత మంగళవారం జరిగిన ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యపై దేశం ఉలిక్కిపడింది. నిర్భయంగా వార్తలు రాస్తున్న ఓ జర్నలిస్టును చంపేశారంటూ పాత్రికేయ లోకం మండిపడుతూ రోడ్ల మీదకొచ్చి ఆందోళన నిర్వహించింది. పలు రాజకీయ పార్టీలు కూడా ఆమె హత్యను ఖండించాయి.

 

దీనిలో భాగంగా జనసేన తరపున స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు పవన్..అంతా బాగానే ఉంది కానీ అక్కడే జనసేనాని తప్పులో కాలేశారు. గౌరీ లంకేశ్ పేరును గౌరీ శంకర్‌గా పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు పవన్‌పై విరుచుకుపడ్డారు. పార్టీ అధినేతగా ముందు ఆ అంశంపై కనీస అవగాహన ఉంచుకోవాలని..కనీసం పేరు కూడా సరిగా తెలియని పరిస్థితిలో ట్వీట్లు చేయడం అవసరమా అంటూ మొట్టికాయలు వేస్తున్నారు. విషయం తన దృష్టికి రావడంతో చేసిన తప్పును దిద్దుకుంటూ గౌరీ శంకర్ పేరును గౌరీ లంకేశ్‌గా చదువుకోవాలంటూ పవన్ మరో ట్వీట్ చేశారు. అయితే ఆయన ఎలాంటి క్షమాపణ చెప్పకపోవడం గమనార్హం. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu