మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్
posted on Sep 12, 2025 1:15PM

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతకు నిరసనగా రాయపర్తిలో మాజీ మంత్రి ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి. అలాగే రైతులు కూడా పెద్ద సంఖ్యలో యర్రబెల్లితో పాటు ధర్నాకు దిగారు.
దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు రంగంలోకి దిగి ధర్నా విరమించాల్సిందిగా ఎర్రబెల్లిని కోరారు. ఈ సందర్భంగా పోలీసులతో రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు మాజీ మంత్రి ఎర్రబెల్లిని అదుపులోనికి తీసుకుని వర్ధన్న పేట పోలీసు స్టేషన్ కు తరలించారు. అనంతరం రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడ నుంచి చెదరగొట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు.