ఆల్మట్టి గేట్లు ఎత్తివేత.. నారాయణపూర్ డ్యామ్ కు వరద నీరు
posted on Jul 17, 2024 3:33PM
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు ఆల్మట్టి డ్యామ్ కు భారీగా వరద పోటెత్తుతోంది. కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. అల్మట్టి డ్యామ్ నుంచి మొత్తం 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
దీంతో దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్‌లోకి వరద చేరుకుంటోంది.దీంతో దిగువన ఉన్న నారాయణ పూర్ జలాశయంలోకి వరద చేరుకుంటోంది. బుధవారం (జులై 17) సాయంత్రానికి నారాయణపూర్ డ్యామ్ గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది.
దీంతో డ్యామ్ గేట్లు ఎత్తి దిగువన జూరాలకు నీటిని విడుదల చేయనున్నారు. మరో రెండు రోజుల్లో జూరాల కూడా నిండుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ తరువాత శ్రీశైలం డ్యాంకు నీటిని వదులుతామని చెబుతున్నారు. మరోవైపు తుంగభద్రలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది.