విశాఖ హెచ్‌పీసీఎల్‌లో మంటలు
posted on May 25, 2021 4:30PM
విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి. హెచ్‌పీసీఎల్ పరిసరాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాద సమయంలో మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్‌పీసీఎల్ పరిసర ప్రాంత ప్రజల్ని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. మంటల సమయంలో భారీగా పేలుడు శబ్దం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. భయంతో కొందరు పరుగులు తీశారు.
13 ఫైర్ ఇంజన్లతో హెచ్‌పీసీఎల్‌లో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు శ్రమించారు. ప్రమాద సమయంలో అక్కడ 100 మంది ఉద్యోగులు ఉన్నారని.. వారంతా క్షేమంగా ఉన్నారని సమాచారం. ఎటువంటి ప్రాణహాని, గాయాలు జరగకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు.