TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంగ్లాండ్ 330 ఆలౌట్, సెహ్వాగ్ డకౌట్

Published on: Fri Dec 14, 2012 1:22PM

 

England 330 all out, India lose Virender Sehwag, england india nagpur test,  england india 2012

 

నాగపూర్ లో టెస్ట్ లో మొదటి ఇన్నింగ్ లో ఇంగ్లాండ్ 330 పరుగుల కు ఆలౌటైంది. ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 242 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగులో ప్రియర్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత వెంటనే ఇషాంత్ శర్మ బౌలింగులో బ్రెస్నన్ డకౌట్ అయ్యాడు. దీంతో 242 పరుగుల వద్ద ఇంగ్లాండు ఏడో వికెట్‌ను కోల్పోయింది. నిలకడగా ఆడుతున్నరూట్ 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పియూష్ చావ్లా బౌలింగులో అవుటయ్యాడు. భారత బౌలర్లలో పియూష్ చావ్లా మెరిశాడు. అతను నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటి వరకు అంతగా రాణించని ఇషాంత్ శర్మ ఈ ఇన్నింగ్సులో మూడు వికెట్లు తీసుకున్నాడు.


ఇంగ్లాండుతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో భారత్ బ్యాటింగ్ చాలా నిరాశాజనకంగా ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్సులో బ్యాటింగుకు దిగిన వీరేంద్ర సెహ్వాగ్ అండర్సన్ బౌలింగులో పరుగులేమీ చేయకుండా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో బంతికే అతను పెవిలియన్ దారి పట్టాడు. ప్రస్తుతం గంభీర్, పుజారా క్రీజులో ఉన్నారు.