మోదీకి షాకిచ్చిన ఈడీ..!!

 

ముంబయిలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.13వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడి విచారణకు చిక్కకుండా విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది.నీరవ్‌, ఆయన కుటుంబసభ్యులకు చెందిన దాదాపు రూ.637కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వెల్లడించింది. భారత్‌ సహా ఐదు దేశాల్లో ఉన్న ఈ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. భారత్‌, యూకే, అమెరికాల్లోని స్థిరాస్తులు, ఆభరణాలు, ఫ్లాట్లు, బ్యాంకు బ్యాలెన్స్‌లను, తదితర ఆస్తులను జప్తు చేసినట్లు చెప్పింది. దర్యాప్తులో భాగంగా భారత ఏజెన్సీలు విదేశాల్లోని నిందితుల ఆస్తులను జప్తు చేసిన కేసులు చాలా అరుదు.మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి వచ్చిన వివిధ ఆదేశాల మేరకు నీరవ్‌ ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆదిత్య నానావటిపై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులు కూడా జారీ అయినట్లు తెలిపింది.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News