అసోంలో కంపించిన భూమి

అసోంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5గా నమోదైంది. అసోంలోని   మోరిగావ్ జిల్లాలో గురువారం(ఫిబ్రవరి 27) తెల్లవారు జామున రెండున్నర గంటల ప్రాంతంలో ఒక్క సారిగా భూమి కంపించడంతో జనం గాఢ నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.  ఈ భూకంపం వల్ల ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. 

కాగా మోరిగావ్ లో భూమికి 91 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు.  మోరిగావ్ తో పాటు గౌహతి, మేఘాలయ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News