అవును.. మా ఇద్దరికీ సంబంధం వుంది... దువ్వాడ!

తనకు, దివ్వెల మాధురికి సంబంధం వుందని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకున్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయంలో చాలా స్పష్టత ఇచ్చారు. తనకు తన భార్య దగ్గర విలువ లేదని, ఆమె దివ్వెల మాధురికి, తనకు సంబంధం అంటగడుతూ ప్రచారం చేసిందని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. ఒక హోటల్ రూమ్‌లో మాధురి ఈ విషయంలో బాధపడిందని, తనముందే ఆత్మహత్య చేసుకోబోయిందని, అప్పుడు ఆమెని కాపాడి, ధైర్యం చెప్పి అమెకి చేరువ అయ్యానని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. తాను ఏ రంగంలో ఎదిగినా తన భార్యకు ఇష్టం వుండదని, తనను ఎప్పుడు చిన్నచూపు చూస్తుందని, చివరికి తన కూతుళ్ళని కూడా తనకు దూరం చేసిందని శ్రీనివాస్ చెప్పారు. భార్య నుంచి మానసిక వేదనను అనుభవించిన తాను దివ్వెల మాధురికి దగ్గరయ్యానని చెప్పారు. తమది అక్రమ సంబంధం కాదని, పెళ్లయిన పురుషులు, మహిళ ఇష్టపడితే కలసి జీవించవచ్చని చట్టమే చెబుతోందని ఆయన అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News