ఓటమిని అంగీకరించిన హిల్లరీ..

 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన సంగతి తెలిసిందే. మొత్తం 538 స్థానాలకు గాను 276 స్థానాలు గెలుపొందగా.. హిల్లరీ 218 స్ఠానాలు గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో ట్రంప్ కు హిల్లరీ గట్టి పోటీనే ఇచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదట ట్రంప్ ఆధిక్యంలో ఉండగా... ఆతరువాత హిల్లరీ కూడా ముందంజ వేయడంతో ఆఖరి క్షణం వరకూ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో అని ఉత్కంఠత నెలకొంది. కానీ చిట్టచివరికి గెలుపు ట్రంప్ నే వరించింది. ఇక ట్రంప్ గెలుపుపై స్పందించిన హిల్లరీ తన ఓటమిని అంగీకరించారా అంటే అవుననే అంటుంది మీడియా. క్లింటన్‌ ట్రంప్‌కి ఫోన్‌ చేసి ఓటమిని అంగీకరించినట్లు యూఎస్‌ మీడియా రాసింది. అయితే ఈ సందర్భంగా ఆమె ఎలాంటి ప్రసంగం చేయబోరని డెమోక్రటిక్‌ క్యాంపెయిన్‌ చీఫ్‌ జాన్‌ పొడెస్టా ప్రకటించారు. హిల్లరీ వెంట ఉండి చివరి వరకు పోరాడిన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, వారిని ఇళ్లకు వెళ్లిపోవాల్సిందిగా సూచించారు.