ట్రంప్ గెలవాలని హిందూసంస్థ పూజలు, హోమం..
posted on May 12, 2016 10:35AM

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. అందరిచేత విమర్శలు పొందే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయితే ఎలా ఉంటుందా అని ఇప్పటికే చాలా మంది భయపడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ట్రంప్ కు మద్దతుగా ఓ హిందూ సంస్థే ముందుకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వస్తేనే మానవత్వం నిలుస్తుందని.. ఏకంగా ఆయన గెలవాలని పూజలు, హోమాలు కూడా జరిపిస్తున్నారు. ఇంతకీ ఆ సంస్థ ఏంటనుకుంటున్నారు.. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న హిందూ సేనా నేషనలిస్ట్ గ్రూప్. ఈ గ్రూపు సభ్యులు ట్రంప్ గెలవాలని, జంతర్ మంతర్ వద్ద పూజలు, హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూసేన వ్యవస్థాపకుడు విష్ణు గుప్తా మాట్లాడుతూ.. దేవతలంతా ఆయన గెలుపునకు సహరించాలని కోరామని తెలిపారు. అంతేకాదు ప్రపంచాన్ని ఇస్లామిక్ టెర్రరిజం నుంచి కాపాడాలంటే అది ఆయనకే సాధ్యమని ఆయన అన్నారు. మొత్తానికి ట్రంప్ చేసే వివాదాస్పద వ్యాఖ్యలే ఆయనకు ప్లస్ పాయింట్ అవుతున్నాయి.