రజనీకాంత్ కి స్టాలిన్ హెచ్చరిక..

 

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అభిమానులతో సమావేశాల్లో పాల్గొంటు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ఇక ఈరోజు సమావేశంలో మాట్లాడిన రజనీ కాంత్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే స్టాలిన్ గురించి మాట్లాడుతూ.. ఆయన తనకు మంచి స్నేహితుడు అంటూ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు రజనీ వ్యాఖ్యలపై స్పందించిన స్టాలిన్.. రజనీకాంత్ తనను స్నేహితుడిగా భావించినందుకు కృతజ్ఞతలు అని తెలిపారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన రజనీకి ఓ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాజకీయ ప్రవేశంపై రజనీ త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని.. తమిళనాడులో పాగా  వేయాలని బీజేపీ చూస్తోందని.. బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ హెచ్చరించారు.