డీఎల్ అస్త్ర సన్యాసం

 

కాంగ్రెస్ పార్టీ ఒకప్పటి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డి అస్త్ర సన్యాసం చేసేశారు. రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని, ఇలాంటి రాజకీయాల్లో తాను మనుగడ సాగించలేనని, అందుకే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నానని ఆయన తన అనుచరులకు చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన డీఎల్.. తన అనుచరులతో కొంతకాలం క్రితం సమావేశమయ్యారు. వాళ్లందరి అభిప్రాయాలు తీసుకున్నారు. అందరితో మాట్లాడిన తర్వాత, ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.