ఒక్కో డెడ్ బాడీ ఒక్కో చోట... 20 అడుగుల దూరంలోనే 4 మృతదేహాలు...

 

 

ఎన్ కౌంటర్ స్పాట్ లో దిశ నిందితుల డెడ్ బాడీస్ ఒక్కొక్కటీ ఒక్కో చోట పడివున్నాయి. ఎన్ కౌంటర్ స్పాట్ ను మొత్తం బ్లాక్ చేసిన పోలీసులు.... చుట్టూ పసుపు తాడు కట్టారు. మృతదేహాల దగ్గరకు ఇతరులెవరూ రాకుండా పోలీసులు మోహరించారు. అయితే, మూడు మృతదేహాలు ఒకే చోట ఉన్నాయి. గడ్డిలాంటి ప్రాంతంలో ఈ మూడు డెడ్ బాడీస్ కనిపిస్తున్నాయి. మూడింటిలో ఒక మృతదేహం ఒక చోట పడి ఉండగా.... పది అడుగుల దూరంలో మరో రెండు మృతదేహాలు పక్కపక్కనే పడి ఉన్నాయి. అయితే, నాలుగో మృతదేహం మాత్రం ఈ మూడింటికీ కొంచెం దూరంగా చెట్ల మధ్యన కనిపిస్తోంది.