తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Thu Feb 27, 2025 8:24AM
.webp)
తిరుమలలో గురువారం (ఫిబ్రవరి 27) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతోంది.
300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం (ఫిబ్రవరి 26) శ్రీవారిని మొత్తం 62,323 మంది దర్శించుకున్నారు. వారిలో 20,460 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2.92 కోట్ల రూపాయలు వచ్చింది.


