తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Fri Aug 23, 2024 9:43AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. గురువారం (ఆగస్టు 22) శ్రీవారిని మొత్తం 63 వేల 202 మంది దర్శించుకున్నారు. వారిలో 34 వేల 57 మంది తలనీలాలు సమర్పించుకున్నారు
. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 37 లక్షల రూపాయలు వచ్చింది. ఇకు శుక్రవారం (ఆగస్టు 23) భక్తుల రద్దీ మరింత పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి.
భక్తుల క్యూలైన్ టీబీసీ వర్ూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.


