తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Sat Aug 10, 2024 9:32AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (ఆగస్టు 9) శ్రీవారిని మొత్తం 65 వేల 131 మంది దర్శించుకున్నారు. వారిలో 30 వేల 998 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 4 కోట్ల 66 లక్షల రూపాయలు వచ్చింది.
ఇక శనివారం ఉదయం శ్రీవారి ఉచిత దర్శనం కోసం 26 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి శ్రీవారి దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. వారికి శ్రీవారి దర్శనానికి దాదాపు ఐదు గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.


