తిరుమలలో భక్తుల రద్దీ
Published on: Thu Jul 27, 2023 6:54AM
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. నిన్న శ్రీవారిని 74వేల 1268 మంది దర్శించుకున్నారు. 26వేల 817 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 4 కోట్ల 32 లక్షల రూపాయలు వచ్చింది. ఇక ఈ ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 6 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది


