దావూద్ ఇబ్రహీం ఆరోగ్యంపై ఛోటా షకీల్... భాయీ బ్రహ్మాండంగా ఉన్నారు


మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు ఆరోగ్య బాలేదని.. ఆయనకు గుండెపోటుతో ఆస్పత్రిలో ఉన్నారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆఖరికి ఆయన మరణించాడు అన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వదంతులు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వదంతులపై అతడి సన్నిహిత అనుచరుడు ఛోటా షకీల్ స్పందించాడు. అతడి ఆరోగ్యం భేషుగ్గా ఉందని, దావూద్‌కు అనారోగ్యంగా ఉందంటూ పాకిస్తానీ మీడియాలో వచ్చినవన్నీ పచ్చి అబద్ధాలని చెప్పాడు. కరాచీ నుంచి భారతీయ జాతీయ మీడియాతో మాట్లాడాడు. ''నా గొంతు వింటే మీకు ఏమైనా జరిగినట్లు అనిపిస్తోందా? అవన్నీ వదంతులే. భాయీ బ్రహ్మాండంగా ఉన్నారు, ఎలాంటి సమస్యా లేదు'' అని ఛోటా షకీల్ చెప్పాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu