బొగ్గు కుంభకోణంలో దాసరికి బిగుస్తున్న ఉచ్చు..

 

బొగ్గు కుంభకోణంలో కేంద్రమాజీ మంత్రి దాసరి నారాయణరావుకి ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై ఢిల్లీ సీబీఐ కోర్టులో విచారణ జరగగా.. అక్రమ మార్గంలోనే బొగ్గు కేటాయింపులు జరిగాయని న్యాయవాదులు కోర్టుకు వివరించినట్టు తెలుస్తోంది. దీంతో వాదనలు విన్న కోర్టు దాసరి నారాయణరావుపై ఛార్జ్ షీట్ నమోదు చేయాలని ఆదేశించింది. ఆయనతో పాటు జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా, నవీన్ జిందాల్ పైన కూడా  ఛార్జ్ షీట్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. చార్జ్‌షీట్ న‌మోదు చేస్తే వీరిపై కోర్టులో విచార‌ణ ప్రారంభమవుతుంది.