బెజవాడ దుర్గమ్మకి బంగారు కిరీటం
posted on Oct 3, 2024 2:49PM

అమ్మవారికి ముంబైకి చెందిన సౌరభ్ గౌర్ అనే భక్తుడు బంగారం, వజ్రాలతో తయారు చేసిన కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు. సుమారు 3 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ వజ్రాల కిరీటాన్ని తయారు చేయించినట్లు సౌరభ్ గౌర్తెలిపారు. గురువారం నుంచి అమ్మవారు ఈ కిరీటాన్ని ధరించే భక్తులకు దర్శనమివ్వనున్నారు.
అలాగే, కడపకు చెందిన సీఎం రాజేష్ అనే భక్తుడు అమ్మవారికి సూర్య, చంద్ర ఆభరణాలు కానుకలుగా అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లికి చెందిన సూర్యకుమారి అనే భక్తురాలు అమ్మవారికి వజ్రాలతో పొదిగిన ముక్కుపుడక, నత్తు, బులకీ, కర్ణాభరణాలను అందించారు. దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మతల్లికి తొలి రోజున నాలుగుకోట్ల రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలు కానుకలుగా వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.