జీహెచ్ఎంసీ ఆఫీసర్‌పై దాడి.. బీజేపీ కార్పొరేటర్ కేసు నమోదు

 

జాంభాగ్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైష్వాల్‌పై అబిడ్స్‌లో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన సెక్షన్ అధికారి తన విధి నిర్వహణలో ఉండగా, కార్పొరేటర్ ఆయనపై దాడి చేశారని ఫిర్యాదు అందింది. కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం (బీఎన్ఎస్ సెక్షన్ 132), దాడికి పాల్పడటం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌ స్పందించారు. అధికారులపై దాడులు చేస్తే సహించబోమన్నారు. అధికారులను పిలిచి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్‌పై కేసు నమోదు చేసినట్లు అబిడ్స్‌ పోలీసులు కమిషనర్‌కు వివరించారు. ఉద్యోగులపై చై చేసుకోవడంతో విధులు బహిష్కరించి జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News