కరోనా కలకలం.. చండీగఢ్‌లో వైరస్‌తో ఒకరు మృతి

 

కరోనాతో పంజాబ్‌ చండీగఢ్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు. చండీగఢ్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలోని సెక్టార్‌-32లో బుధవారం 40 సంవత్సరాల వ్యక్తి కొవిడ్‌ బారినపడి చనిపోయాడని ఓ అధికారి పేర్కొన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేకంగా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సదరు రోగి మంగళవారం ఆసుపత్రిలో చేరాడని.. అతనికి కొవిడ్‌ సోకినట్లుగా నిర్ధారణ అయ్యిందని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందించారు.

అతనికి కరోనాతో పాటు ఇతర వ్యాధులూ ఉన్నాయని దీంతో ఆరోగ్య పరిస్థితి విషమించి ఇవాళ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. భారత్‌లో సోమవారం వెయ్యికిపైగా యాక్టివ్‌ కొవిడ్‌ కేసులు ఉన్నట్లుగా కేంద్ర రోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. అత్యధికంగా యాక్టివ్‌ కేసులు కేరళలో 430 ఉండగా.. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, కర్నాటకలో అత్యధికంగా ఉన్నాయి.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu