సారిక పిరికిది కాదు.. కుటుంబసభ్యులు
posted on Nov 4, 2015 10:19AM

కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని కోడలు సారిక మనుమలు అభినవ్, అమోన్, శ్రీయోన్ లు కూడా సజీవ దహనమయ్యారు. బెడ్ రూమ్ లో సిలిండర్ లీకేజ్ వల్లనే మంటలు చెలరేగాయని.. పూర్తిగా కాలిపోయారని చెబుతున్నారు. సారిక ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గతంలో కూడా సారిక రెండుసార్లు ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు.
కానీ ఇప్పుడు సారిక మృతి పట్ల ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి కుటుంబ సభ్యులు సారిక ఆత్మహత్య చేసుకునేంత పరికిది కాదని ఆరోపిస్తున్నారు. సారికను హత్య చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సారిక తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండగా.. తల్లి, సోదరి నిజామాబాద్ నుండి వరంగల్ బయలుదేరారు.