నేడు మెహబూబ్ నగర్ జిల్లా బంద్
posted on Sep 5, 2015 10:42AM
.jpg)
కాంగ్రెస్, తెరాస ఎమ్మెల్యేలు కొట్టుకొని మెహబూబ్ నగర్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మొన్న జరిగిన జెడ్పీ సమావేశం తెరాస ఎమ్మల్యే గువ్వల బాలరాజు కాంగ్రెస్ శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డిపై చెయ్యి చేసుకొన్నారు. అందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మెహబూబ్ నగర్ జిల్లా బంద్ కి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ కార్యకర్తలు డిపోలలో నుండి బస్సులను బయటకి రాకుండా అడ్డుపడటంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి.
ఈ విషయం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్ళినా ఆయన కానీ ఆయన తరపున మంత్రులెవరూ ఈ వ్యవహారంపై స్పందించలేదు. వారు స్పందించకపోవడం చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చెయ్యి చేసుకొన్న బాలరాజును సమర్దిస్తున్నట్లే ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తెరాస ఎమ్మెల్యే బాలరాజు తమ ఎమ్మెల్యేపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగానిస్తున్నామని టీ-కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత కె. జానారెడ్డి అన్నారు. టీ-కాంగ్రెస్ నేతలు గవర్నర్ ని కలిసి తెరాస ఎమ్మెల్యేపై పిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.