సినియర్ సిటిజన్లకోసం కూడా ఒక కమీషన్ ఉండాలి
posted on Oct 15, 2012 10:18AM
.png)
సీనియర్ సిటిజన్స్ కోసం ఒక ప్రత్యేక కమీషన్ ఉండాలని మాదిగ దండోరా నేత మందా కష్ణ మాదిగ కోరారు. సీనియర్ సిటిజన్స్ కోసం వెంటనే ప్రత్యేక కమీషన్ నియమించాలని, మందా కోరారు. రాష్ట్రంలో చెట్టుకు, గుట్టలకు కమీషన్ ఉన్నా సీనియర్లకు, వితంతువులకు కమీషన్ లేక పోవడం విచారకరం అన్నారు. గవర్నర్ కోటాలో సీనియర్ సిటిజన్లను శాసనమండలికి ఎంపిక చేయాలన్నారు. వారికి క్యాబినేట్ హోదా తో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. ఎల్.కె.జీ నుండి పిహెచ్ డి వరకు వితంతువుల పిల్లలకు ఉచిత విద్య అందించాలని డిమాండు చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం తీవ్రతరం చేస్తామన్నారు. ఇందులో భాగంగా నవంబర్ 28 నుండి విద్యార్ధులతో ఢిల్లీలో ఆందోళన చేపడతామని మందకష్ణ మాదిగ తెలిపారు.