ఎం.ఎస్.నారాయణ కన్నుమూత
posted on Jan 23, 2015 8:48AM

ప్రముఖ హాస్యనటుడు ఎం.ఎస్.నారాయణ కన్నుమూశారు. అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఎం.ఎస్. నారాయణ వయసు 63 సంవత్సరాలు. 1951వ సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో జన్మించిన ఆయన పూర్తిపేరు మైలవరపు సూర్యనారాయణ. మొదట తెలుగు లెక్చరర్‌గా పనిచేసిన ఆయన ఆ తర్వాత సినిమా రంగానికి వచ్చి అనేక సినిమాలకు రచయితగా పనిచేశారు. ఆయన ఆ తర్వాత నటుడిగా మారారు. 500 పైగా సినిమాలలో నటించారు. హాస్యపాత్రల పోషణలో ప్రత్యేక శైలితో ఆయన తెలుగువారిని అలరించారు. ఐదు నంది అవార్డులు, ఒక ఫిలిం ఫేర్ అవార్డు ఆయన అందుకున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె వున్నారు. ఎంఎస్ నారాయణ నటించిన పటాస్, రేయ్, శంకర సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి.