యుద్ధ ట్యాంకులు రాష్ట్రాలనే కొనుక్కోమంటారా? మోదీపై కేజ్రీవాల్ ఫైర్‌..

కేంద్రం వ‌ర్సెస్ ఢిల్లీ స‌ర్కార్‌. పీఎం మోదీ వ‌ర్సెస్ సీఎం కేజ్రీవాల్‌. క‌రోనా స‌మ‌యంలో రెండు ప్ర‌భుత్వాల మ‌ధ్య వివాదం వార్‌గా మారుతోంది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలో ఉదాసీన‌త‌పై కేంద్రాన్ని కేజ్రీవాల్ ఎప్ప‌టిక‌ప్పుడు క‌డిగి పారేస్తున్నారు. కోర్టుకు వెళ్లి.. పోరాడి మ‌రీ.. ఢిల్లీకి కావ‌ల‌సిన ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ల‌ను తెప్పించుకున్నారు. అయితే, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా మెరుగుప‌డినా.. వ్యాక్సినేష‌న్ కొర‌త తీవ్రంగా వేధిస్తోంది. కేంద్ర అసంబ‌ద్ధ చ‌ర్య‌ల వ‌ల్లే.. వ్యాక్సినేష‌న్ విధానం అస్థ‌వ్య‌స్థంగా మారిందంటూ సీఎం కేజ్రీవాల్ కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు కేజ్రీవాల్‌. 

‘‘కేంద్రం వ్యాక్సిన్లను కొనడం లేదు. అలాగని రాష్ట్రాలకు స్వేచ్ఛనూ ఇవ్వడం లేదు. ప్రస్తుతం మనం కొవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఒకవేళ పాకిస్తాన్ భారత్‌పై దాడులు చేస్తే, రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలకే వదిలేస్తారా?.. సొంతంగా యుద్ధ ట్యాంకులు కొనుక్కోమని అంటారా?’’ అంటూ కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు.

ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఏర్పడిన వ్యాక్సినేషన్ కొరతపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర 
వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వ్యాక్సిన్లను ఎందుకు కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వడం లేదని మండిపడ్డారు. 

ఇతర దేశాల లాగా కాకుండా భారత్‌లో ఆరు నెలల ఆలస్యంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని విమర్శించారు కేజ్రీవాల్‌. మొదటి వ్యాక్సిన్ భారతీయులే భారత్‌లో తయారు చేశారని, అప్పటి నుంచి టీకా నిల్వలు పెంచితే, సెకండ్ వేవ్‌ను సమర్థమంతంగా ఎదుర్కొని ఉండేవారని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ మాట‌లు తూటాల్లా కేంద్ర స‌ర్కారును తూట్లు పొడుస్తున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News