మంత్రుల పనితీరుపై సర్వే..

 

ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన వారికి అప్పుడప్పుడు చురకలు వేస్తునే ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఇక రాష్ట్ర మంత్రుల పనితీరుపై దృష్టిసారించనున్నట్టు తెలుస్తోంది. ఈరోజు సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటంటే

*ప్రతినెలా మంత్రుల పనితీరుపై సర్వే
*ప్రభుత్వ పథకాల తీరుపై కూడా సర్వే
*సెప్టెంబర్ 9 నుంచి రైతు కోసం యాత్రలు
*వ్యవసాయానికి పగటిపూట 7 గంటలపాటు నిరంతర విద్యుత్
*నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కార్యాలయాల తరలింపు వేగవంతం
*భూసేకరణ పద్ధతుల్లో మచిలీపట్నం పోర్టుకు భూములు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.
*
1300 కోట్ల రూపాయలతో ఈ ప్రగతి ప్రాజెక్టును పీపీపీ మోడల్‌లో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News