కేంద్రం నో.. చంద్రబాబు ఎస్

 

విజవాడలో మెట్రో రైల్.. అసలు ఈ విషయంపై ఒక క్లారిటీ రావడం లేదు. విజయవాడకు మెట్రో రైల్ వస్తుందా?రాదా? అసలు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా అని ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే విజవాడలో మెట్రో రైల్ నిర్మించాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ఆయన ప్రతిపాదనను తిరస్కరించింది. విజయవాడకు మెట్రో రైలు అవసరం లేదని..  20 లక్షల మంది ఉంటేనే ఆనగరానికి మెట్రో రైలు అవసరం ఉంటుందని.. కాని విజయవాడలో అంత జనాభా లేదు కాబట్టి విజయవాడకు మెట్రో రైలు అవసరం లేదని కేంద్రం తేల్చి చెప్పింది.

అయితే ఈ విషయంలో మాత్రం చంద్రబాబు వెనక్కి తగ్గకుండా చాలా పట్టదలతో ఉన్నట్టు తెలస్తోంది. దీనిలో భాగంగానే అసెంబ్లీ సమావేశానికి కూడా దూరంగా ఉండి విజయవాడ విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల విషయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 2018 ఆగస్టు నాటికి విజయవాడ మెట్రో రైలు తొలొదశ పూర్తి అయ్యేలా చూడాలని చంద్రబాబు కోరినట్టు తెలుస్తోంది. మెట్రో రైలుకు నిధుల కొరత లేదని  జపాన్ కు చెందిన జైకా సంస్థ ఆర్థిక సహకారం అందిస్తుందని శ్రీధరన్ కు ఆయన వివరించారు

అయితే మెట్రోల నిర్మాణ ప్రగతిని ప్రతినెల సమీక్షించేలా ప్రాసెస్‌ చార్ట్‌ను రూపొందించాలని శ్రీధరన్‌ను చంద్రబాబు కోరారు. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఈ ప్రాజెక్టు పై వేగంగా పురోగతి సాగించాలని సూచించారు. మొత్తానికి బాబు పట్టుదల చూస్తుంటే కేంద్రం సహాయం లేకుండానే ఈ పని పూర్తి చేసేలా ఉన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News