పుష్కర ఏర్పాట్లపై చంద్రబాబు అగ్రహం.. అవసరమైతే తీసేయండి..
posted on Jul 21, 2016 4:10PM
.jpg)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కర పనులపై పర్యవేక్షణ నిర్వహించారు. అయితే పనులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా సీతానగరంలో పుష్కర పనులను పర్యవేక్షించడానికి వెళ్లిన ఆయన పనులు జరుగుతోన్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాలకు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉందని, అయినా ఇంకా పనులు మందకొడిగా జరుగుతున్నాయని.. పనులు నిర్ణయించిన కాల వ్యవధిలోపు పూర్తి కాకపోవడంపై సమాధానం ఇవ్వాలని ఆయన చెప్పారు. అంతేకాదు ఆ గుత్తేదారుని తీసేసి మరొకరికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ఇంకా ఈ ఏర్పాట్ల గురించి..అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.