పాశమైలారం మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సిగాచీ పరిశ్రమ

పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడులో 40 మంది మరణించినట్లు సిగాచీ అధికారికంగా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో 33 మంది గాయపడినట్లు ధృవీకరించింది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది.

అలాగే క్షతగాత్రులకు పూర్తి వైద్య సహాయం అందిస్తామనీ, అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొంది. ఈ మేరకు సిగాచీ తరఫున ఆ కంపెనీ కార్యదర్శి వివేక్ కుమార్ ఓ ప్రకటక విడుదల చేశారు.  ఈ ప్రమాదంపై స్టాక్‌మార్కెట్‌కు కూడా  సమాచారం ఇచ్చిన ఆయన మూడు నెలల పాటు కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu