చిరంజీవి 150 సినిమాపై వీడిన కన్ఫ్యూజన్

 

చిరంజీవి 150వ సినిమా గురించి ఇప్పటకే ఎన్నో వార్తలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా వస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ రాకముందే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మొదట్లో ఈ సినిమాకి వినాయక్ డైరెక్టర్ అని వార్తలు వచ్చాయి.. తరువాత ఈ పూరి జగన్నాథ్ అని అన్నారు. ఆతరువాత పూరిజగన్నాథ్ కాదు అని కూడా వార్తలు వచ్చాయి.. అయితే మళ్లీ ఈ సినిమాకు పూరీనే డెైరెక్టర్ అని మళ్లీ అన్నారు. మొత్తానికి ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో ఇప్పటికీ అభిమానులకు కన్ఫ్యూజన్ గానే ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై కన్ఫ్యూజన్ వీడింది. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ డైరెక్టర్ కాదని ఈ విషయాన్ని చిరంజీవీనే స్వయంగా వెల్లడించారు. ఈ సినిమాకు పూరి ఇప్పటివరకూ ఫస్ట్ హాఫ్ మాత్రమే చెప్పాడని, సెకండ్ హాఫ్ ఇంకా ఇవ్వలేదని చెప్పారు. అంతేకాదు ఇంకా వేరే దర్శకులు కథలు కూడా వింటున్న అని అవి కనుక నచ్చితే వచ్చే రెండు మూడు నెలల్లో షూటింగ్ మొదలవుతుంది అని చిరు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి కన్ఫ్యూజన్ పోయిన మళ్లీ చిరంజీవి 150వ సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారో ఇంకా తెలియని సస్పెన్స్ గానే ఉన్నది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu