జగన్‌పై దూకుడు పెంచిన చిరంజీవి
posted on May 23, 2012 11:26AM
వైయస్ జగన్‌పై కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి దూకుడు పెంచారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న చిరంజీవి వైయస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంటిలో రెండు మూడు వందల పడక గదులు కట్టుకున్న వైయస్ జగన్ ప్రజలకు ఎలా సేవ చేస్తాడని ఆయన అడిగారు. వైయస్ జగన్ దురాశ, అధికార దాహం వల్లనే రాష్ట్రంలో ప్రస్తుతం ఉప ఎన్నికలు వచ్చాయని ఆయన విమర్శించారు. జగన్ వెంట ఉన్న వారు అతనిని హీరోగా కీర్తిస్తున్నారని, వారికి త్వరలోనే ఆయన విలనిజమ్ తెలుస్తోందన్నారు.తన తండ్రి వైయస్ చనిపోయిన అయిదు నిమిషాలకే జగన్ సిఎం కుర్చీ కోసం ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించారని ఆరోపించారు. ఇది చూసి ఎలాంటి కొడుకుని కన్నానని వైయస్ ఆత్మ క్షోభించి ఉంటుందన్నారు. చిరంజీవి దగ్గరకు రావడానికి కొంత మంది తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సమయంలో వారిపై పోలీసులు లాఠీలు ఝళిపించారు.