మెగాస్టార్..ఫెల్యూర్ స్టారేనా ?

 

 

 chiranjeevi, congress chiranjeevi, chiranjeevi prp, chiranjeevi tollywood

 

 

చిరంజీవి మాజీ మెగాస్టార్‌.. అవును ఇప్పుడు చిరు సినిమా హీరోకాదు ఓ రాజకీయనాయకుడు.. అతికొద్ది కాలం కొనసాగిన ఓ పార్టీకి మాజీ అధ్యక్షుడు.. కేంద్ర మంత్రి కూడా.. సినిమా హీరోగా ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన చిరంజీవి రాజకీయనాయకునిగా మాత్రం వరుస ఫెయిల్యూర్స్‌నే చవి చూస్తున్నాడు..

 

ఒకప్పుడు చిరంజీవి మైక్‌ పట్టుకుంటే జనాలు ఇలవేసి గోల చేసేవారు.. అభిమానులు సీట్లో కుదురగా కూర్చోలేకపోయేవారు.. ప్రజలు సునామీలా పొటేత్తేవారు.. కాని ఇప్పుడు అంత సీన్‌ లేదు.. పంచ్‌ డైలాగ్స్‌తో అభిమానులకు ఉత్సాహాన్నిచే చిరు ప్రసంగాల్లో ఇప్పుడు ఆ పస కనిపించడం లేదు..



        చిరు ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలో ఎప్పుడు విదేశి పర్యటనల్లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.. టూరిజం సదస్సులతో పాటు, కేన్స్‌ లాంటి కలర్‌ఫుల్‌ వేదికల మీద కూడా అలరిస్తున్నాడు.. కాని ఏ వేదిక మీదా చిరులో మునుపటి మెగాస్టార్‌ చరిష్మా కనిపించటం లేదు.. మాటల్లో అప్పటి పవర్‌, పంచ్‌ మచ్చుకైనా కనిపించటం లేదు..

 

 

chiranjeevi, congress chiranjeevi, chiranjeevi prp, chiranjeevi tollywood



       

తాజాగా తానా సభల్లో ప్రసంగించిన చిరు. తన మాటల్లో వాడి తగ్గిందని మరోసారి నిరూపించాడు.. తొలిసారిగా కేంద్రమంత్రి హోదాలో తానాకు హాజరైన చిరంజీవికి అదేస్థాయిలో ఘనంగా స్వాగతం పలికారు తానా నిర్వాహకలు.. తెలుగు మాటలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్న ప్రవాస భారతీయులు చిరు ఏం మాట్లాడతాడాని ఎదురు చూస్తుంటే వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లాడు మెగాస్టార్‌..



        హీరోగా ఏది మాట్లాడిన చెల్లుతుంది కాని.. ఓ మంత్రిగా రాజకీయనాయకుడిగా తనకంటూ కొన్ని పరిథులుంటాయని భావించిన చిరు.. తన మాటల్లో ఎక్కడ మునుపాటి వాడి వేడి కనిపించకుండ జాగ్రత్త పడుతున్నారు.. అయితే ఈ మాటలు చిరు రాజకీయ భవిష్యత్తుకు ఎంత వరకు ఉపయోగపడతాయోగాని ఆయన అభిమానులకు ఆయన రాకతో సభ మరింత సక్సెస్‌ అవుతుందనుకున్న నిర్వహకులకు మాత్రం నిరుత్సాహమే మిగిలింది..



        చిరు మాటల్లో వాడి తగ్గడం కాంగ్రెస్‌ వర్గాల్లో కూడా కలవరం కలిగిస్తుంది.. ప్రస్థుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో జనాలను ఆకర్షించే ఎకైక నేతగా ఉన్న చిరు ప్రసంగాల్లో కూడా పస తగ్గిపోతే ఎలా అని తలలు పట్టుకుంటున్నారట.. ఇదిలాగే కొనసాగితే చిరు మాజీ మెగాస్టార్‌ అన్నది నిజమౌతుందంటున్నారు విశ్లేషకులు..