చోటా రాజన్ సంచలన వ్యాఖ్యలు.. నన్ను చంపడానికి చూస్తున్నారు

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండోనేసియాలోని బాలి జైలులో ఉన్న ఛోటారాజన్ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ముంబై పోలీసులు నన్ను హింసించారు.. వారిలో కొంతమంది దావూద్ ఏజెంట్లు ఉన్నారని అన్నారు. 22 ఏళ్లుగా దావూద్ తో పోరాడుతున్నాను.. దావూద్ అంటే నాకు భయంలేదు.. కానీ ముంబై పోలీసులు దావూద్ తో చేతులు కలిపి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. అంతేకాదు భారత ప్రభుత్వం నన్ను ఏ జైలుకు పంపించినా వెళ్తానని చెప్పాడు. కాగా ఛోచా రాజన్ ను ఈ రోజు భారత్ కు తీసుకొచ్చే అవకాశం ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu