తమిళనాడుకు మరో ముప్పు...

 

ఇప్పటికే వార్ధా తుఫాను వల్ల తమిళనాడు మొత్తం కకావికలం అయిపోయింది. ఈరోజు కాస్త పరిస్థితి కుదుటపడింది అనుకునేలోపు మరో ముప్పు తమిళనాడుకు రానుంది.  రానున్న 12 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. కాగా సోమవారం ఒక్కసారిగా విరుచుకుపడిన వర్దా  తుపానుతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లను అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ తుపాను దెబ్బకు రెండు రాష్ట్రాల్లో దాదాపు 12 మంది ప్రాణాలు విడిచారు. తుపాను దెబ్బకు పూరిళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.

 

మరోవైపు వర్దా తుపాను సంభవించినప్పటికీ ఈ నెల 16 నుంచి చెన్నైలోని చెపాక్‌ మైదానంలో భారత్‌-ఇంగ్లండ్‌ ఐదో టెస్టు మ్యాచ్‌ షెడ్యూల్‌ ప్రకారం యథాతథంగా జరగనుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu